సిద్దిఖీకి మళ్లీ పులిట్జర్ పురస్కారం

సిద్దిఖీకి మళ్లీ పులిట్జర్ పురస్కారం

భారత ఫొటోగ్రాఫర్‌ దానిశ్‌ సిద్దీఖీకి మరణానంతరం ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. భారత్‌లో కరోనా మరణాలపై ఆయన తీసిన చిత్రాలకు గాను పులిట్జర్‌ అవార్డు ప్రకటించారు. 2022 సంవత్సరానికి గాను పులిట్జర్‌ ప్రైజ్‌ విజేతలను ప్రకటించారు. ఇందులో ఫీచర్‌ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్‌ సంస్థకు చెందిన డానిశ్‌ సిద్దిఖీ, అద్నన్‌ అబిదీ, సన్నా ఇర్షాద్‌, అమిత్‌ దవేను విజేతలుగా ప్రకటించారు. భారత్‌లో కొవిడ్‌ మరణాలపై వీరు తీసిన చిత్రాలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు కమిటీ వెల్లడించింది. కరోనా మహమ్మారి రెండో ఉద్థృతి సమయంలో ఢల్లీి సహా పలు ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది.  ఢిల్లీ లో ఒకేసారి అనేక మంది మరణించడంతో పలు శ్శశాన వాటికల్లో సామూహిక అంత్యక్రియలు చేపట్టారు. అందుకు సంబంధించి సిద్దీకీ తీసిన ఫోటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. కొవిడ్‌ ఉధృతి సమయంలో ఆయన తీసిన ఎన్నో  చిత్రాలు భారత్‌లో మహమ్మారి పరిస్థితులకు అద్దం పట్టడమే గాక, ఎంతో మంది హృదయాలను కదలించాయి. కాగా సిద్దీఖీ పులిట్టర్‌ గెలుచుకోవడం ఇది రెండోసారి.

 

 

Tags :