లాస్ ఏంజెలెస్‌లో అనూహ్య ఘటన

లాస్ ఏంజెలెస్‌లో అనూహ్య ఘటన

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పైలట్‌ మాత్రమే ఉన్న ఓ చిన్న విమానం సరిగ్గా రైలు పట్టాలపై కూలిపోయింది. విమానం ధ్వంసం కాగా తీవ్రగాయాలపాలైన పైలట్‌ బయటకు రావడానికి అపసోపాలు పడుతున్నాడు. అదే సమయంలో పట్టాలపై రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇక క్షణాల్లో రైలు డీకొడుతుందనగా పోలీసులు ఆపద్బాంధవుల్లా వచ్చారు. అతికష్టం మీద అతణ్ని విమానం నుంచి బయటకు తీసి రక్షించారు. తర్వాత సంబంధిత అధికారులకు సమచారం ఇచ్చి, రైళ్ల రాకపోకలు కాసేపు నిలిపేశారు. ట్రాక్‌పై పడిన విమాన శకలాల్ని తొలగించారు.

 

Tags :