రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు ... వాళ్లు అనుకుంటే ఎవరినయినా

రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు ... వాళ్లు అనుకుంటే ఎవరినయినా

భారత్‌ జోడో యాత్రలో భాగంగా సోషల్‌ మీడియా సంస్థలను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్‌ జోడో యాత్ర సాగుతోంది. వాసిం జిల్లాలో ఓ సభలో రాహుల్‌ మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ విజయాన్ని అవి నిర్ణయిస్తున్నాయన్నారు. ఈవీఎంలు సురక్షితంగా ఉన్నప్పటికీ భారత దేశంలో జరిగే ఎన్నికలను సోషల్‌ మీడియా ద్వారా రిగ్గింగ్‌ చేయవచ్చు. సోషల్‌ మీడియా సంస్థలు కోరుకుంటే ఏ పార్టీనైనా ఎన్నికల్లో గెలిపించగలవు. ఇక్కడ ఒక క్రమపద్ధతిలో పక్షపాతవైఖరిని అనుసరిస్తున్నారు. అందుకు నా ఖాతాలే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఒక సిద్ధాంతానికి చెందిన నేతలు సమాజంలో అసమానతలకు మతఘర్షణలకు ఒక వ్యూహాత్మకంగా ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అలాగే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు. ఇక్కడి అధికార పక్షం ఏ పార్టీకి చెందినదో అంతుబట్టడం లేదన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.