సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ?

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు పోస్టింగ్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వాణిజ్యపనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు తగిన పదవి ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్‌లకు స్థాన చలనం కలగవచ్చని తెలుస్తోంది. ఈ వారంలోనే బదిలీలు వుండ వచ్చని తెలుస్తోంది. సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డికి రిపోర్టు చేసిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌తోనూ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్కు ఏ పోస్టు ఇవ్వాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కసరత్తు చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించి తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసానని, పోస్టు చిన్నాదా పెద్దదా అనే ఆలోచన లేదని సోమేశ్ స్పష్టం చేశారు.