ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలి ...

ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలి ...

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టమా? అంటూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్ట సవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా ? అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :