'సన్ ఆఫ్ ఇండియా' థియేట్రికల్ ట్రైలర్

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన సంచలనాత్మక చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. చిత్ర కథానాయకుడిగా డాక్టర్ మోహన్‌బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో ఈ రోజు (10.2.2022) సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు.
ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది...
ప్రపంచమంతా నా కుటుంబం... ప్రపంచం బాధే నా బాధ...
స్వామి... ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... నేను దాన్నే ఫాలో అవుతున్నా...
ఇండియాలో అసలు న్యాయమే జరగదా...
డబ్బున్నోడికి ఓ న్యాయం ... డబ్బులేనోడికి ఓ న్యాయం... పవర్ ఉన్నోడికి ఓ న్యాయం... పవర్ లేనోడికి ఓ న్యాయం... డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉంటే ఎలా...
అయ్యోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నాను... ఈ సొసైటీలో చెత్త నా కొడుకులని, క్రిమనల్ నా కొడుకులని ఏరిపారేయాలి...
పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది...
నీ ప్రశ్నలన్నింటికి సమాధానం నీతో పాటు 135 కోట్ల ఇండియన్స్ కి చాలా డిటైయిల్డ్ గా చెబుతాను...
1 మినిట్ 33 సెకన్ల ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగ్స్, విజువల్స్ తో ఆసక్తికరంగా ఉంది. ప్రముఖతారాగణమంతా ప్రధాన పాత్రలను పోషించిన 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతోంది.
డా.మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.