MKOne Telugu Times Business Excellence Awards

నల్లగొండలో సొనాటా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

నల్లగొండలో సొనాటా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో  ప్రారంభం కానున్న ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అమెరికాకు చెందిన సొనాటా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ  ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఐటీ టవర్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్‌ 200 ఉద్యోగాలు కల్పిస్తుంది. సొనాటా సాఫ్ట్‌వేర్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీని వీరవెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి ఇందుకూరి తదితరులు భేటీలో పాల్గొన్నారు.

 

 

Tags :