నేను తాత్కాలికం కాదు.. పూర్తి స్థాయి బాధ్యతలు : సోనియా

నేను తాత్కాలికం కాదు.. పూర్తి స్థాయి బాధ్యతలు : సోనియా

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది.  సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది అస్మమతి నేతలపై సోనియా సీరియస్‌ అయ్యారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాదు నేరుగా నాతో మాట్లాడండి. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ పార్టీ పునరుజ్జీవనమే అంతా కోరుకుంటున్నారన్నారు. అందుకోసం నేతల మధ్య, ఐక్యత, క్రమశిక్షణ అవసరం. పార్టీ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. కరోనా వల్లే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఆలస్యమైందని అన్నారు.

 

Tags :