MKOne Telugu Times Youtube Channel

పూర్తిగా కోలుకోలేదు.. మరింత సమయం ఇవ్వండి

పూర్తిగా కోలుకోలేదు.. మరింత సమయం ఇవ్వండి

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి లేఖ రాశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ప్రశ్నించందుకు మరింత గడువు కోరారు. కరోనా సోకడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు. కరోనా, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సోనియాను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో పూర్తిగా కోలుకునే వరకు హాజరును కొన్ని వారాలు వాయిదా వేయాలని కోరుతూ ఈడీకీ ఆమె లేఖ రాశారు అని అందులో పేర్కొన్నారు. మరోపక్క రాహుల్‌ గాంధీ ఐదు రోజుల పాటు ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది. 

 

Tags :