భారత్‌ జోడో యాత్ర’ కోసం కర్ణాటక చేరిన సోనియా గాంధీ

భారత్‌ జోడో యాత్ర’ కోసం కర్ణాటక చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘భారత్‌ జోడో యాత్ర’.. తొలి బీజేపీ పాలిత తొలి రాష్ట్రాన్ని చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటకలో జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా యాత్రలో పాల్గొనేందుకు కర్ణాటక చేరుకున్నారు. సోమవారం నాడు మైసూర్  ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ఇతర పార్టీ నేతలు స్వాగతం పలికారు. దసరా నేపథ్యంలో రెండు రోజుల విరామం అనంతరం గురువారం జరిగే ‘భారత్‌ జోడో యాత్ర’లో సోనియా గాంధీ పాల్గొంటారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.