బీజేపీలోకి బీసీసీఐ చీఫ్ గంగూలీ ?

బీజేపీలోకి బీసీసీఐ చీఫ్ గంగూలీ ?

బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరుతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దాదాతో సమావేశం కావడం మరింత బలం చేకూరింది.  బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తున్న నేపథ్యంలో పార్టీలోకి ఆహ్వానించేందుకు అమిత్‌ షా స్వయంగా రంగంలోకి దిగాడు. అయితే  కోల్‌కతా పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంటికి విందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా తనను చూసేందుకు గంగూలీ ఇంటి పరిసరాలకు వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. విందులో దాదాతో పాటు అతడి కుటుంబ  సభ్యులు పాల్గొన్నారు. సౌరవ్‌ మీడియాతో మాట్లాడుతూ అమిత్‌ షా తన ఇంటికి విచ్చేస్తుండడం వెనుక రాజకీయ కారణాలేవీ లేవన్నాడు. షా తనకు ఎంతోకాలంగా తెలుసునని చెప్పారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అమిత్‌ సా కుమారుడు జైషా తాను కలిసి పని చేస్తున్న విషయాన్ని గంగూలీ గుర్తు చేశారు.

 

Tags :