బోన్‌మ్యారో దాతల పేర్ల నమోదు విజయవంతం

బోన్‌మ్యారో దాతల పేర్ల నమోదు విజయవంతం

తెల్ల రక్త కణాల సంబంధిత బీటా తలసేమియా క్యాన్సర్‌ వ్యాధిని నయం చేయాలంటే దాతలు దొరకడంలేదు. ఈ విధమైన బోన్‌ మ్యారో దాతలను గుర్తించడంలో విఫలమవడానికి కారణం బోన్‌ మ్యారో ఇవ్వడానికి ఇష్టపడే సాటి భారతీయుల పేర్లను బోన్‌ మ్యారో రిజిస్టర్‌ లో నమోదు చేసి ఉండకపోవడమే కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొందరు బోన్‌ మ్యారో దాతలను రిజిష్టర్‌ చేసేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సౌత్‌  హెవెన్‌ కమ్యూనిటీ, కొప్పల్‌, టెక్సాస్‌ లో నివసిస్తున్న ఔత్సాహిక భారతీయులు జూలై 24వ తేదీన ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాతలను రిజిష్టర్‌ చేసుకున్నారు. 

పీపుల్‌ సేవింగ్‌ పీపుల్‌ ఫౌండర్‌ ‘వెంకటేశ్వర చిన్ని’ పర్యవేక్షణలో మరియు ‘శ్రీ మనస్వి సూరి’ నాయకత్వంలో SWAB TO SAVE LIFE నినాదంతో  నిర్వహించిన ఈ సమావేశంలో బోన్‌ మ్యారో దాతలను గుర్తించి వారి పేర్లను నమోదు చేయించే బృహత్తర కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది మూడు గంటల లోపే 50 మందికి పైగా బోన్‌ మ్యారో దాతల పేర్లను బోన్‌ మ్యారో రిజిస్టర్లో నమోదు చేయడం జరిగింది.  
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోన్‌ మ్యారో చికిత్సా ప్రక్రియను ముందుగా మరింత తెలియచెప్ప కలిగి ఉంటే మనతో పాటు ఇక్కడ నివసిస్తున్న మరింత మందికి ప్రయోజనకారిగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. చికిత్సకు సిద్ధం చేసేముందు బోన్‌ మ్యారో దాతల నుంచి సేకరించేందుకు ఇంతవరకు అనుసరిస్తున్న విధానం కంటే పూర్తిగా భిన్నమైన క్రొత్త ప్రక్రియ వచ్చిందని,  దానిని ‘’పెరిఫెరల్‌ బ్లడ్‌ స్టెమ్‌ సెల్‌ డొనేషన్‌ ప్రక్రియ’’ అంటారని తెలియజేశారు.

ప్రత్యేక తరహాలో చేసే ఈ ప్రక్రియలో బోన్‌ మ్యారో మార్పిడికి సహకరించిన దాతలకు ఎటువంటి ఆపరేషన్‌ చేయనవసరం లేదు పైగా ఇది సురక్షితమైన ప్రక్రియ. ఈమధ్య ఇవిఎ అనే పదమూడు సంవత్సరాల భారతీయ అమ్మాయికి బీటా తలసేమియా అనే రక్తసంబంధమైన క్యాన్సర్‌ తో బాధపడుతున్నట్లుగా వైద్యపరీక్షలలో తేలింది. కాని ఆమెకు అవసరమైన బోన్‌ మ్యారో చికిత్స చేయాలంటే దాతలను ఒప్పించి చికిత్సకు సహకరించేలా చేయాల్సి ఉండేది. కాని ఆమెకు అవసరమైన దాత దొరకలేదు. ఇటువంటి హృదయ విదారక పరిస్థితి లో మార్పు తేవడానికి, అలాంటివారికి సహాయపడడానికి  మనం చేయగలిగింది బోన్‌ మ్యారో రిజిస్టర్‌ ని ప్రోత్సహించడం  మరియు మనతో పాటు మరింత మందిని బోన్‌ మ్యారో రిజిస్టర్‌ లో చేరేలా కృషి చేయడం మన ముందున్న ప్రధమ కర్తవ్యమని ఈ కర్తవ్య నిర్వహణలో అనుకున్నది సాధించడానికి ప్రతిబంధకంగా ఉన్న భయాన్ని దూరం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్‌ మాజీ అధ్యక్షులు లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :