అణు నిరాయుధీకరణకు ముందుకు వస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

అణు నిరాయుధీకరణకు ముందుకు వస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

అణు నిరాయుధీకరణకు ముందుకు వస్తే ఆ దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుదలకు సాహసోపేతమైన ప్రణాళిక అమలుకు మద్దతు ఇస్తామని దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యూల్‌ అన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన యూన్‌ సుక్‌ యూల్‌ కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం ఉత్తర కొరియాకు స్నేహహస్తం అందించారు. చర్చల ద్వారా విభేదాలు పరిష్కరించుకుందామని అన్నారు. దక్షిణ  కొరియా పలు సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో యూన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలో పదో ఆర్థికశక్తిగా ఎదిగిన ఈ దేశానికి భద్రత, ఆర్థిక, సామాజికపరంగా పలు సమస్యలు ముందుకున్నాయి.  కొవిడ్‌తో ఆర్థిక వ్యవసత్థ కొంతవరకు దెబ్బతింది. ఉత్తర కొరియా విషయంలో దృఢమైన వైఖరి అవలంబిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన యూన్‌ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంలో సౌమ్యంగానే వ్యవహరించారు.

 

Tags :