74 ఏండ్ల తర్వాత భారత్ గడ్డపై.. చీతాల సందడి

74 ఏండ్ల తర్వాత భారత్ గడ్డపై.. చీతాల సందడి

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కనుమరుగైన చీతాలు మళ్లీ భారత గడ్డపై సందడి చేయనున్నాయి. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో 8 చీతాలు మన దేశానికి రానున్నాయి. అందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో వదలనున్నారు. ఆడ చీతాల వయసు 2`5 ఏండ్ల, మగ చీతాల వయసు 4.5-5.5 ఏండ్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. చీతాలను తీసుకొచ్చే విమానం ముందు భాగాన్ని పులి బొమ్మతో డిజైన్‌ చేశారు. నమీబియా నుంచి 16 గంటలు ప్రయాణించి చీతాలు భారత్‌లోని జైపూర్‌కు చేరుకొంటాయి. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా కునో జాతీయ పార్కుకు తరలిస్తారు.

 

Tags :