దాతృత్వానికి మారుపేరు మన డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి

దాతృత్వానికి మారుపేరు మన డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి

కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి వైద్యరంగంలో పేరు ప్రఖ్యాతులను పొందారు. మాతృభూమి సేవకు, మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటారు. ఏ కార్యక్రమం జరిగిన అందుకు తనవంతుగా సహాయాన్ని అందిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా, నిడిగుంటపాలెంకు చెందిన డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి 70వ దశకంలో అమెరికాకు వెళ్లారు. ఆ దేశంలోని 14 రాష్ట్రాల్లో ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ పేరిట 46 ఆస్పత్రులను నెలకొల్పారు. ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విద్యుత్‌ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి కష్టపడి చదువుకుని  వైద్య రంగంలో ప్రపంచ స్థాయి వైద్యులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకు న్నారు. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెంలోనే ప్రేమ్‌సాగర్‌ రెడ్డి  హైస్కూల్‌ విద్యాభ్యాసం సాగింది. తరువాత తిరుపతిలోని ఎస్‌.వి మెడికల్‌ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్‌ పూర్తి చేశారు. హౌస్‌ సర్జన్‌ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్‌ స్టేట్‌ మెడికల్‌ సెంటర్లో ఇంటర్నల్‌ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్‌ పూర్తి చేశారు. 1981లో సదరన్‌ కాలిఫోర్నియాలో మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్‌ ప్రొసీజర్స్‌ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు  తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్‌ కేర్‌ మెడికల్‌ గ్రూప్స్‌’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్‌ గ్రూప్‌ ప్రారంభించారు.

1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్‌ కేర్‌ హాస్పిటల్‌ని నిర్మించారు.  ఇప్పుడు ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో యు.ఎస్‌.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్‌.లో టాప్‌`10 ఆసుపత్రులలో ఒకటిగా ప్రైమ్‌ కేర్‌ గుర్తింపు పొందింది. నష్టాల్లో ఉన్న ఆసుపత్రులను మళ్ళీ లాభాలబాటలో పయనింపజేయడం డాక్టర్‌ ప్రేమ్‌ సాగర్‌ రెడ్డికి సాధ్యమని అంటారు. అలాగే ఆయన వైద్యునిగా సేవలందిస్తూనే మరోవైపు కమ్యూనిటీకి తనవంతుగా సహాయసహకారాలను అందిస్తుం టారు. ఇందుకోసం ఓ చారిటబుల్‌ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఇతం సంరక్షణకు సంబంధించిన కారణాల కోసం వందల మిలియన్ల డాలర్లను ఆయన ఖర్చు చేస్తున్నారు. ఆయన తన 25 సంవత్సరాల వైద్య అనుభవంలో ఎన్నో విజయాలను చేజిక్కించు కున్నారు. కరోనరీ యాంజియోగ్రఫీ మరియు యాంజియోప్లాస్టీ మరియు శాశ్వతంతో సహా 5,000 కంటే ఎక్కువ గుండెకు సంబంధించిన ఆపరేషన్లను నిర్వహించిన డాక్టర్‌ రెడ్డిని మోడరన్‌ హెల్త్‌కేర్‌ అత్యంత ప్రభావవంతమైన 50మందిలో ఒకరిగా పేర్కొంది. ఎన్నో అవార్డులను గుర్తింపును పొందిన డాక్టర్‌ ప్రేమ్‌ రెడ్డి తన సొంతూరుకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్నో సేవలందిస్తూ వస్తున్నారు. అలాగే అమెరికాలోని తెలుగు సంఘాలు చేసే కార్యక్రమాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. 

ఆయన సాధించిన విజయాలు, ఆసుపత్రి గురించి ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

https://www.primehealthcare.com/

https://www.premreddy.com/

 

Tags :