స్పైస్ జెట్ వార్షికోత్సవ ఆఫర్ ... రూ.1818కే టికెట్

దేశియ విమానయాన సంస్థ స్పైస్ జెట్ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్లను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌లో ప్రయాణికులు 1818 రూపాయలకే విమాన టికెట్ కొనుగోలు చేయవచ్చు. బెంగళూర్-గోవా, ముంబై-గోవా నగరాల మధ్య ప్రయాణించే వారు మాత్రమే ఈ ఆఫర్ కింద తక్కువ ధరకు టికెట్ బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ సేల్ మే 23 నుంచి 28వ తేదీ వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు 2023 జులై 1 నుంచి 2024 మార్చి 30లోగా ప్రయాణించవచ్చని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పాటు స్పైస్ జెట్ డిస్కౌంట్ కూపన్లు కూడా అందిస్తోంది.
Tags :