తొందరపడ్డ పెళ్లిసందD బ్యూటీ...!

తొందరపడ్డ పెళ్లిసందD బ్యూటీ...!

పెళ్లిసందD సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల. బేసిక్ గా ఈ హీరోయిన్ తెలుగు అమ్మాయేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఫస్ట్ సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడుకి వరుసగా ఆఫర్లు వచ్చాయి.

అందంతో పాటు మంచి ఫిజిక్ శ్రీలీలకి ప్లస్ పాయింట్ అయ్యింది అని చెప్పొచ్చు. సాధారణంగా మొదటి సినిమా ప్లాప్ అయితే ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం కష్టమనే చెప్పాలి. కానీ, శ్రీలీల విషయం లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఫస్ట్ సినిమా అటకెక్కినా, చేతిలో అరడజన్ కి పైగా సినిమాలతో ఈమె బిజీ గా ఉంది.

తాజాగా మహేష్ బాబు కొత్త సినిమాలో ఛాన్స్ దక్కింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఇందులో శ్రీలీలకి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెకి సెకండ్ హీరోయిన్ గా చేయాల్సిన అవసరమే లేదు.

మహేష్ హీరో అని, త్రివిక్రమ్ డైరెక్టర్ అని సెకండ్ హీరోయిన్ గా అయినా పర్వాలేదని ఈ సినిమాకి శ్రీలీల కమిట్ అయినట్టు సన్నిహితులు చెప్తున్నారు. ఇలా తొందరపాటు నిర్ణయాల వల్ల ఫ్యూచర్ లో తన కెరీర్ కి ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నారు.

ఒక్కసారి సినిమాలకి సెకండ్ హీరోయిన్ గా కమిట్ అయితే ముందు ముందు అలాంటి అవకాశాలే వస్తాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీలీల క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేసాడో చూడాలి ....

 

 

Tags :