శ్రీలీల కోసం త్రివిక్రమ్ మనసు మార్చుకుంటాడా?

త్రివిక్రమ్ సినిమాలంటే ఇద్దరు హీరోయిన్లుండటం సర్వ సాధారణం. అయితే మొదటి హీరోయిన్‌కు ఉన్న ప్రాధాన్యత రెండో హీరోయిన్‌కు ఉండదు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఏదో గ్లామర్ కోసం రెండో హీరోయిన్‌ను పెట్టుకోవడం తప్పించి, ఆమె వల్ల కానీ, ఆ క్యారెక్టర్ వల్ల కానీ సినిమాకు ఒరిగేదేమీ ఉండదు.
రీసెంట్‌గా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఏ సినిమా చూసినా ఈ విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. అల వైకుంఠపురములో నివేదా పేతురాజ్ లాంటి అందగత్తెను పెట్టుకుని, కేవలం రెండు మూడు సీన్లకే పరిమితం చేశాడు తప్పించి, ఆమె క్యారెక్టర్‌ను వాడుకుంది లేదు. అలాగే అరవింద సమేత సినిమాలో ఈష రెబ్బా క్యారెక్టర్ కూడా. అఆ సినిమాలో మాత్రం అనుపమ పరమేశ్వరన్‌కు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినట్లు అనిపిస్తుంది. అది కూడా ఈ సినిమాలతో పోలిస్తేనే. కానీ ఆ పాత్ర కూడా సమంత క్యారెక్టర్ ముందు తేలిపోయింది. ఇక అసలు విషయానికొస్తే, మహేష్ సినిమా కోసం పూజా హెగ్డే ను ఒక హీరోయిన్‌గా అనుకున్న విషయం తెలిసిందే.
పూజా తో పాటుగా మరో హీరోయిన్‌గా శ్రీ లీలను కూడా సెలెక్ట్ చేశాడు త్రివిక్రమ్. త్వరలోనే ఈ బ్యూటీలిద్దరూ సెట్‌లోకి రానున్నారు. అయితే ఈ సినిమా విషయంలో పూజాతో పాటుగా శ్రీ లీలకు కూడా దాదాపు ఒకే ఇంపార్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. ఫస్ట్ హీరోయిన్ పూజానే అయినప్పటికీ, ప్రస్తుతం శ్రీ లీలకు ఉన్న క్రేజ్‌ను చూసి మరిన్ని సన్నివేశాలు త్రివిక్రమ్ ఆమెకు రాశాడట. రీసెంట్‌గా ప్రొడ్యూసర్ వంశీ కూడా మహేష్- త్రివిక్రమ్ మూవీలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ కాదని, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని చాలా స్ట్రాంగ్‌గా చెప్పుకొచ్చాడు. వంశీ మాటలను బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ పెన్ను ఈ సారి శ్రీ లీల కోసం కాస్త ఎక్కువగానే రాసేట్లుంది.