మాకు ఎవరు ఇష్టమో.. వారితోనే

మాకు ఎవరు ఇష్టమో.. వారితోనే

దక్షిణాసియా ట్రేడ్‌ అగ్రిమెంట్‌ విషయంలో చాలా రాజకీయాలున్నాయని, ఆ ప్రాంతానికంతటికీ ఒకే ఒప్పందం ఉండాలన్న దానిపై ఒత్తిళ్లకు లొంగబోమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింగే అన్నారు. మాకు దేనితో ప్రయోజనాలు లభిస్తాయో, మాకు ఎవరు ఇష్టమో వారితోనే ఒప్పందం చేసుకుంటామని కుండబద్దలు కొట్టారు. అంతర్జాతీయ ఒప్పందాన్ని బదులు ద్వైపాక్షిక ఒప్పందాలకే తాము మొగ్గుచూపుతామని స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు, దేశ పునర్మిర్మాణానికి సంబంధించిన నమ్మేళనంలో ఆయన మాట్లాడారు. చైనాతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న శ్రీలంక అధ్యక్షుడి వ్యాఖ్యల సందర్భంగా భారత్‌ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అంతరార్థం అదే. చైనాకు దూరంగా ఉండాలని భారత్‌ ఒత్తిడి తీసుకుస్తున్నట్లు కథనాలు వెలువడిన నేపథ్యంలో రణిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Tags :