శ్రీలంకలో అరుదైన ఘటన... 80 ఏండ్లలో ఇదే తొలిసారి

శ్రీలంకలో అరుదైన ఘటన... 80 ఏండ్లలో  ఇదే తొలిసారి

శ్రీలంకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 80 ఏండ్లలో తొలిసారిగా ఓ ఆడ ఏనుగు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. 25 ఏండ్ల సురంజి అనే ఏనుగు ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్లు వన్యప్రాణా సంరక్షణ అధికారులు ప్రకటించారు.  జన్మనిచ్చిన ఏనుగు సెంట్రల్‍ హిల్స్లోని పిన్నవాలా ఏనుగుల ఆశ్రమ కేంద్రంలో ఉంటోంది. ఈ ఏనుగు పిల్లల తండ్రి పాండు (17) కూడా అక్కడే ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కవలలతో పాటు తల్లి ఏనుగు ఆరోగ్యకరంగా ఉన్నట్లు తెలిపారు. సురంజి 2009లో ఒక మగ ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. శ్రీలంకలో చివరిసారిగా 1941లో ఓ ఏనుగు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

 

Tags :