భారత పర్యాటలకు బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్

భారత పర్యాటలకు బంపర్ ఆఫర్..  ఒక టికెట్ కొంటే మరో టికెట్

భారత పర్యాటకులకు శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అక్కడి ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని దేశాల్లో పూర్తిగా టీకా వేయించుకున్న పర్యాటకులకు అనుమతిస్తోన్నట్లు పేర్కొంది. భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ ఒక టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఉచితం ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడిరచింది. శ్రీలంకన్‌ హాలిడేస్‌ లేదా శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్లలో 2021 అక్టోబర్‌ 31 వరకు చేసుకునే బుకింగ్‌లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుతం దేశంలోని 9 నగరాల నుంచి విమానాలు నడుపుతోంది. అదనపు టికెట్‌ ఆఫర్‌ ద్వారా భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో శ్రీలంకకు ఆకర్షితులవుతారని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.

 

Tags :