వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో అష్టలక్ష్మీ దశావతార మండపంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకీపై మండపానికి వేంచేపు చేశారు. శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు పూలదండలు మార్చుకోవడం, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలాంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి బంగారు తిరుచ్చిపై అవేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం  చేయడంతో తొలిరోజు వేడుక ఘనంగా ముగిసింది. పరిణయ మండపాన్ని ఆపిల్‌, నారింజ, ద్రాక్ష, మొక్కజోన్న కంకులు, ఆనాస పండ్లు, అరటి, మామిడి కొమ్మలతో ద్భుతంగా తీర్చిదిద్దారు.

 

Tags :