రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీశ్రీ రవిశంకర్

రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీశ్రీ రవిశంకర్

దేశ రాజకీయాలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతిపక్షం చాలా బలహీనంగా వుందన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కావాలంటే దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని స్పష్టం చేశారు. దేశానికి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి. అది నిర్మాణాత్మకంగా కూడా వుండాలి.  ప్రతిపక్షంలో నాయకత్వ సమస్య కూడా ప్రబలంగానే ఉంది. ప్రతిపక్షం లేనిదే ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని పేర్కొన్నారు. ఓ బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని భారత దేశం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే బెంగాల్‌లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగాయని, న్యాయ వ్యవస్థ కూడా బలంగా వుందని అన్నారు. అయితే ఇవన్నీ సవ్యంగానే వున్నా, బలహీనమైన ప్రతిపక్షం ఉందన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్షం లేని కారణంగా నిరంకుశత్వంలా కనిపిస్తోందని అన్నారు.

 

 

Tags :