శ్రీశ్రీ రవిశంకర్‌కు శాంతిదూత అవార్డు ప్రదానం

శ్రీశ్రీ రవిశంకర్‌కు శాంతిదూత అవార్డు ప్రదానం

భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌కు అమెరికాలోని మెంఫిస్‌లో నేషనల్‌ సివిల్‌ రైట్స్‌ మ్యూజియం ప్రతిష్ఠాత్మక ది ఎమిసరీ ఆఫ్‌ పీస్‌ (శాంతిదూత) అవార్డును ప్రదానం చేసింది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ను స్థాపించిన రవిశంకర్‌ దాని ద్వారా ప్రాణాయామం, ఒత్తిడి నివారణ, యోగా, ధ్యానంపై స్వచ్ఛందంగా బోధిస్తున్నారు. అవార్డు ప్రదానం సందర్భంగా నేషనల్‌ సివిల్‌ రైట్స్‌ మ్యూజియం బోర్డు డైరెక్టర్‌ శైలా కర్కెలా మాట్లాడుతూ ది ఎమిసరీ ఆఫ్‌ పీస్‌ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు అందించడాన్ని గౌరవప్రదంగా, ఆనందంగా భావిస్తున్నామని అన్నారు.

 

 

Tags :