చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆచార్య’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్‌ను అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి కుమార్తె.. రామ్ చ‌ర‌ణ్ అక్క సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

రెండు నిమిషాల పాటు సాగే ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్ చూస్తే అందులో శోభ‌న్ బాబుగా సంతోష్ శోభ‌న్‌.. శ్రీదేవిగా గౌరి జి కిష‌న్ క‌నిపించారు. సంతోష్ ఎక్కువ‌గా మాట్లాడే కుర్రాడిగా క‌నిపిస్తే హీరోయిన్ గౌరి షార్ట్ టెంపర్ ఉన్న అమ్మాయిగా క‌నిపించింది. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ రెండు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. వారి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ప్ర‌ధానంగా సినిమా సాగుతుండి. శ‌ర‌ణ్య పొట్ల ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సిద్ధార్థ్ రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి శ‌శిధ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ద‌త్తాత్రేయ‌, భాషా విజువ‌ల్స్ ఎఫెక్ట్స్‌, పొలాకి విజ‌య్ కొరియోగ్రఫర్‌గా వ‌ర్క్ చేశారు. సుష్మిత కొణిదెల ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు.

 

 

Tags :