వర్జీనియాలో డెమెక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించండి - శ్రీధర్‌ నాగిరెడ్డి

వర్జీనియాలో డెమెక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించండి - శ్రీధర్‌ నాగిరెడ్డి

వర్జీనియా గవర్నర్‌ పదవికి నవంబరు 2న జరిగే ఎన్నికల్లో టెర్రీని గెలిపించాలని, అమెరికా అధ్యక్షులు జోసఫ్‌ బైడన్‌ నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ వాషింగ్టన్‌ డీసీ డెమోక్రాటిక్‌ పార్టీ నాయకులు శ్రీధర్‌ నాగిరెడ్డి ఆధ్వర్యంలో లౌడెన్‌ కౌంటీ, వర్జీనియా రాష్ట్రంలోని లౌడెన్‌ కౌంటీలో  ప్రవాస భారతీయ నాయకులు తొలిసారిగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భర్త డగ్లస్‌ ఎమ్హాహాఫ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత వర్జీనియా గవర్నర్‌, ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్న టెర్రీ మెకాలిఫ్‌, అటార్నీ జనరల్‌గా పోటీ చేస్తున్న మార్క్‌ హేరింగ్‌, అమెరికా రిప్రజెంటేటివ్‌ జెన్నిఫర్‌ వెక్సన్‌, వర్జీనియా సెనేటర్‌ జెన్నిఫర్‌ బాయిస్కో, డెలిగేట్‌ సుహాస్‌ సుబ్రహ్మణ్యం, డెలిగేట్‌ వెండీ గూడిటిస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు కోరారు. ఈ సమావేశంలో ప్రవాస తెలుగు, భారతీయ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు భాగమయ్యారు. శ్రీధర్‌ నాగిరెడ్డితోపాటు, టిడిఎఫ్‌ నాయకురాలు కవితా చల్లా ఇతర ఎన్నారై ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags :