రైతుకి ట్రాక్టర్ సేద్య పరికరాలు ఇచ్చిన తానా

రైతుకి ట్రాక్టర్ సేద్య పరికరాలు ఇచ్చిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, ‘తానా’ ఫౌండేషన్‌ మరియు టీమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమంలో భాగంగా సన్నకారు రైతుల సహయార్థం వికలాంగ రైతుకు చేయూతనిచ్చారు. టీమ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ ఎన్నారై శ్రీనివాస్‌ అబ్బూరి ఈ సహాయాన్నందించారు. వినుకొండలోని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన దివ్యంగ రైతు శ్రీనివాసరావు పాలడుగు ఎకరం భూమి సాగు చేస్తూ ఇద్దరు ఆడకూతుళ్ళను చదివిస్తున్నారు. వైకల్యం అడ్డుకోకుండా ఆసరాగా ఉంటుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు చేతుల మీదగా కొత్తపేటలో శ్రీనివాస్‌ అబ్బూరి ట్రాక్టర్‌ తాళం అందచేశారు. మెరికాలోని సియాటిల్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తూ, వాషింగ్టన్‌ తెలుగు సమితి అధ్యక్షునిగా, ఎన్నారై టిడిపి కమిటీ సభ్యునిగా సేవలందిస్తున్న శ్రీనివాస్‌ అబ్బూరి గత జనవరిలో కూడా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ల్యాప్‌టాప్‌లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 

Tags :
ii). Please add in the header part of the home page.