వాషింగ్టన్‌లో వైభవంగా వెంకన్న కల్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా వాషింగ్టన్‌లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు, వేదపండితులు అగమోక్తంగా సంప్రదాయబద్దంగా కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ ఘట్టం ప్రత్యక్షంగా పాల్గొని వీక్షించిన ప్రవాస భారతీయులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, టిటిడి ఎఇఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags :