స్టాన్‌స్వామి మరణంపై దర్యాప్తు :అమెరికా

స్టాన్‌స్వామి మరణంపై దర్యాప్తు :అమెరికా

మానవ హక్కుల కార్యకర్త, ఎల్గార్‌ పరిషత్‌ మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు ఫాదర్‌ స్టాన్‌స్వామి జ్యుడీషియల్‌ కస్టడీలో మరణించడంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా చట్టసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సభ్యుడు జువాన్‌ వర్గాస్‌ దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌(చట్టసభ)లో ప్రవేశపెడుతూ మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్టాన్‌స్వామి జ్యుడీషియల్‌ కస్టడీలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ఆయన మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని, అప్పుడే నిజాలు బయటికి వస్తాయని తెలిపారు. కాగా 84 ఏండ్ల వయసున్న స్టాన్‌ స్వామి గత ఏడాది జులై 5న ముంబై జైలులోనే మరణించారు.

 

Tags :