హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ రాక

తెలంగాణ రాష్ట్రంలో మరో అతి పెద్ద కంపెనీ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమెరికాలోని తన ప్రధాన కార్యాలయం తర్వాత మరో కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించనున్నట్లుగా ప్రకటించింది. 5,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లుగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ స్ట్రీట్ కంపెనీ తెలిపింది. 40 ట్రిలియన్ డాలర్లకు పైగా కలిగి ఉన్న స్టేట్ స్ట్రీట్ సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో పెట్టుబడులను పెట్టనుంది. ఏఐ ఆగ్మెంటేషన్, డేటా అనలిటిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీలలో ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా పేర్కొన్నారు. స్టేట్ స్ట్రీట్ హైదరాబాద్‌లో అకౌంటింగ్, హెచ్‌ఆర్‌తో పాటు గ్లోబల్ సర్వీస్‌ను కూడా అందించనుంది. బోస్టన్‌లోని ప్రధాన కార్యాలయం తర్వాత రెండోవ అతిపెద్ద కార్యాకలాపాలను ఇక్కడి నుంచే నడిపించనుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌కు రానుండటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.