హైదరాబాద్‌లో రూ.440 కోట్లతో స్టెమ్ సెల్ కంపెనీ

లైఫ్ సైన్సెస్ రంగంలో దేశంలోనే అతిపెద్ద స్టెమ్ సెల్ తయారీ ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు స్టెమ్ క్యూర్స్ కంపెనీ ప్రకటించింది. సుమారు 54 మిలియన్ డాలర్ల (సుమారు రూ.440 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ తయారీ యూనిట్‌తో 150 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మన దేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కాగా ప్రపంచ వైద్య ఆవిష్కరణలకు తన సొంత నగరమైన హైదరాబాద్ హబ్‌గా మారిందంటూ సాయిరాం సంతోషం వ్యక్తం చేశారు.