న్యూయార్క్ కు రావొద్దు... ప్రపంచ దేశాల నేతలకు అమెరికా కబురు

న్యూయార్క్ కు రావొద్దు... ప్రపంచ దేశాల నేతలకు అమెరికా కబురు

ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వ సభ్య సమావేశం వచ్చే నెలలో అమెరికాలో నిర్వహించనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉండటంతో అక్కడికి 150 కి పైగా ప్రపంచ దేశాలకు చెందిన ముఖ్య నేతలు ప్రసంగించేందుకు తరలిరానున్నారు. ఇంతమంది అగ్ర నేతలు, వారి సహాయగణం న్యూయార్క్ కు చేరుకుంటే కరోనా మరింత విజృంభిస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొనకుండా వీడియో సందేశాలు ఇస్తే బాగుంటుందని అమెరికా ప్రపంచ దేశాల నేతలకు కబురు పంపింది. 192 దేశాల ముఖ్య నేతలు, న్యూయార్క్ నగరవాసులు అనవసరంగా మరింతగా వైరస్‍ ముప్పు బారిన పడకుండా చూద్దాం అంటూ అమెరికా ఆయా దేశాలకు సూచనలు చేసింది. మరి ప్రపంచ దేశాల నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి.

 

Tags :