'స్ట్రీట్ లైట్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

'స్ట్రీట్ లైట్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

తాన్య దేశాయ్‍, అంకిత్‍ రాజ్‍, కావ్య రెడ్డి, వినోద్‍ కుమార్‍ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్‍ నిర్మించిన చిత్రం స్ట్రీట్‍ లైట్‍. ఈ చిత్రం ఈ నెలలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‍ హైదరాబాద్‍లో ప్రీ రిలీజ్‍ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు వినోద్‍ కుమార్‍ మాట్లాడుతూ క్రైమ్‍, లవ్‍, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్తో రూపుదిద్దుకుంది అన్నారు. నిర్మాత మామిడాల శ్రీనివాస్‍ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్లో ఈ నెల విడుదల చేయడానికి ప్లాన్‍ చేస్తున్నాము. తెలుగు, హిందీ రెండు భాషల్లో విడుదల చేస్తున్నాము. స్ట్రీట్‍ లైట్‍ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. దర్శకుడు విశ్వప్రసాద్‍ మాట్లాడుతూ స్ట్రీట్‍ లైట్‍ సినిమాను మీరందరూ ఆదరించాలి. ముందు ఈ సినిమాను ఓటీటీకి విడుదల చేయాలని అనుకున్నాం కానీ థియేటర్స్ బాగుండాలనే ఉద్దేశ్యంతో థియేటర్స్లో విడుదల చేస్తున్నాము అన్నారు. నిర్మాత ప్రసన్న కుమార్‍, బెక్కం వేణుగోపాల్‍, రామసత్యనారాయణ, బాలాజీ నాగలింగం, హీరోయిన్‍ తాన్యా దేషాయ్‍ తదితరులు కూడా మాట్లాడారు.

 

Tags :