బీడీలు చుట్టే కార్మికుడు.. నేడు అమెరికా జడ్జిగా

10వ తరగతి తర్వాత చదువు మానేసి పూర్తిగా బీడీలు చుట్టే కార్మికుడిగా పని చేసిన వ్యక్తి నేడు అగ్రరాజ్యం అమెరికాలో న్యాయమూర్తిగా ఎదిగారు. ఆయనే కేరళకు చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. జనవరి 1న టెక్సస్‌లోని జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సురేంద్రన్ది కేరళలోని కాసరగడ్. తల్లిదండ్రులు దినసరి కూలీలుగా చేసేవారు. చదువు మానేసిన తర్వాత ఆయనలో చదువుకోవానే సంకల్పం ఎక్కువైంది. దాంతో సంవత్సరం తర్వాత ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ర్మీడియట్లో జాయిన్ అయ్యారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత హోటల్లో పనిచేస్తూ లా విద్యనభ్యసించారు. 1996లో కేరళలో ప్రాక్టీసు మొదలు పెట్టి, పేరున్న లాయర్‌గా ఎదిగారు. సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించారు. 2007 లో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. రెండేళ్ల తర్వాత తొలి ప్రయత్నంలోనే టెక్సస్ బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ హోస్స్టన్ లా సెంటర్లో ఎల్ఎల్ఎం చేశారు. తర్వాత సొంతగా ఓ లా సంస్థను ప్రారంభించారు. కాగా, ఈ కొత్త ఏడాది మొదటి రోజున ఆయన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.