సుధీర్ వర్మ్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్?

సినీ ఇండస్ట్రీలో దాదాపు పాతికేళ్లకు పైగా కెరీర్ ఉంది పవన్ కళ్యాణ్ కు. కానీ తను ఇంకా 30 సినిమాలు కూడా చేయలేదు. మిగతా హీరోలతో కంపేర్ చేస్తే పవన్ చేసింది చాలా తక్కువ సినిమాలు. వాటిలో దాదాపు నాలుగైదు సినిమాలు త్రివిక్రమ్ భాగస్వామ్యంలోనే ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేసిన పవన్, ఆయన రైటింగ్ తో వచ్చిన తీన్‌మార్, భీమ్లానాయక్, ఇప్పుడు వినోదాయ సీతం రీమేక్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబోలో త్వరలోనే మరో సినిమా వచ్చే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. అలాగని ఆ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయట్లేదు. అది రీమేక్ కూడా కాదు. మొదటిసారిగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసమని రాసుకున్న కథని వేరే డైరెక్టర్ తెరకెక్కించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుధీర్ వర్మ్.
స్వామిరారా సినిమాతో మంచి విజయం అందుకున్న సుధీర్, ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. త్వరలోనే తను దర్శకత్వం వహించిన రావణాసుర రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే పవన్ కోసం త్రివిక్రమ్ రాసిన ఓ స్టోరీకి సంబంధించిన లైన్ తనకు చెప్పాడని, అది తనకెంతో నచ్చిందని, ఆ స్టోరీని డైరెక్ట చేయాలని త్రివిక్రమ్ తనకు చెప్పారని సుధీర్ రీసెంట్‌గా చెప్పుకొచ్చాడు.
సుధీర్ విషయానికొస్తే తన టేకింగ్ అంతా బాగానే ఉంటుంది కాన స్క్రిప్టుల విషయంలోనే తనకు అసలైన సమస్య. త్రివిక్రమ్ లాంటి రైటర్ తనకు మంచి స్టోరీ ఇస్తే, పవన్ లాంటి స్టార్ హీరోను సుధీర్ బాగానే వాడుకోగలడు. కానీ ఇప్పటికే పవన్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పట్టాలెక్కాలంటే చాలానే టైమ్ పట్టేట్లుంది.