కామన్వెల్త్ లో భారత్‌కు మరో స్వర్ణం

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్ మోడల్ సాధించాడు. ఆసియా పారా ఒలింపిక్స్ కాంస్య విజేత అయిన 27 ఏండ్ల సుధీర్ కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్, రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 134.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
Tags :