సీఎం జగన్‌కు తండ్రిపై అంత ప్రేమంటే.. ఏదైనా కొత్త సంస్థకు

సీఎం  జగన్‌కు తండ్రిపై అంత ప్రేమంటే.. ఏదైనా కొత్త సంస్థకు

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌కు తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా కొత్త సంస్థను స్థాపించిన దానికి ఆయన పేరు పెట్టుకోవచ్చని, దాన్ని ఎవరూ తప్పపట్టరని అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్పులాంటి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్థాలకు దారి తీసే అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున సమీక్షించుకోకపోతే ప్రజలే తగ్గిన బుద్ధి చెబుతారని అన్నారు.

 

Tags :