చార్మినార్ వద్ద సండే-ఫన్‌ డే సందడి

చార్మినార్ వద్ద సండే-ఫన్‌ డే సందడి

పాతబస్తీ చార్మినార్‌ వద్ద ఈ నెల 17వ తేదీ (ప్రతి ఆదివారం) నుంచి  ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌ పేరు ఫన్‌డే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టాంక్‌ బండ్‌ పై అలరించినట్టుగానే చార్మినార్‌ వద్ద కూడా సాయం సమయంలో వచ్చే సందర్శకులను అలరించనుంది. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకూ సండే ఫన్‌ డే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమయంలో చార్మినార్‌ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించరు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు పోలీస్‌ బ్యాంక్‌ నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అర్ధరాత్రి వరకూ లాడ్‌బజార్‌ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను పెద్దలను ఆకట్టుకునే కార్యక్రమాలు, వివిధ రకాల ఫుడ్‌స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి వచ్చే సందర్శకులకు పార్కింగ్‌ సదుపాయం కూడా అధికారులు కల్పించారు.

 

Tags :