తరుణ్ చుగ్ ఔట్.. సునీల్ బన్సాల్ ఇన్

తరుణ్ చుగ్ ఔట్.. సునీల్ బన్సాల్ ఇన్

తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తరుణ్‌ చుగ్‌ను తొలగించిన ఆయన స్థానంలో సునీల్‌ బన్సాల్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తేవటంలో బన్సాల్‌ కీలకంగా వ్యవహరించారు. 2022లోనూ యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యేందుకు సాయపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సునీల్‌ బన్సాల్‌ నియామకాన్ని ప్రకటించారు.

 

Tags :