MKOne TeluguTimes-Youtube-Channel

ఈ హత్య ఎవరు చేశారో ప్రజలకు తెలియాలి

ఈ హత్య ఎవరు చేశారో ప్రజలకు తెలియాలి

తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. వివేకా వర్థంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ  ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని చెప్పారు. కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించాం. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు కూడా తెలుసు. హత్య కేసులో ప్రేమయం ఉందని నమ్ముతున్నందునే సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాం. నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదలిపెట్టగలను అని అన్నారు.

 

 

Tags :