పోకిరి, దూకుడు సినిమాలకంటే ‘సర్కారు వారి పాట’ పెద్ద హిట్ : సూపర్ స్టార్ కృష్ణ

పోకిరి, దూకుడు సినిమాలకంటే ‘సర్కారు వారి పాట’ పెద్ద హిట్ : సూపర్ స్టార్ కృష్ణ

సినిమా జయం పరాజయం అనే విషయాల్ని సీరియస్ గా తీసుకొని స్టార్ మహేష్ బాబు మంచి సినిమా తీశామా అనే  పంథాలో వెళ్లిపోతుంటారు. ఎవరు ఏమనుకున్నా.. పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన తండ్రి సూపర్ స్టార్ అలా కాదు.. విజయమైనా... అపజయమైనా ముక్కుసూటిగా చెప్పేరకం సూపర్ స్టార్ కృష్ణ .. మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోల్లో వివాద రహితుడు. ఏ హీరోతోనూ అలాగే ఇతర హీరోల ఫ్యాన్స్‌‌తో మహేష్ బాబుకి ఇష్యూస్ ఉండవు. తన సినిమా బాగున్నా.. బాలేకపోయినా ఆయన ప్రవర్తనలో మార్పు ఉండదు. నా సినిమా బాలేకపోతే నాకంటే ముందు నా ఫ్యాన్సే ఇష్టపడరని.. వాళ్లు ఇష్టపడే సినిమాలు చేయడమే తన పని అని తన పని తాను చేసుకుని పోతుంటారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఏనాడూ కూడా గర్వం చూపించడం కానీ.. దురుసుగా ప్రవర్తించడం కానీ చేసిన దాఖలాలు లేవు.

అయితే మహేష్ బాబు వివాదాల జోలికిపోడు కదా.. ఏమన్నా ఊరుకుంటాడు కదా అని కొన్ని ఛానల్స్ ఆయనపై పనికట్టుకుని బురదజల్లడం స్టార్ట్ చేశాయి. పని కట్టుకుని ‘సర్కారు వారి పాట’ సినిమా బాగోలేదని ప్రచారం చేశాయి. మహేష్ బాబుకి రాజకీయ రంగు పులుముతూ సినిమాకి డివైడ్ టాక్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంచి సినిమాని ప్రేక్షకులకు దూరం చేయడం వీళ్ల తరం కాదని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. సర్కారు వారి పాట చిత్రానికి బ్రహ్మరధం పడుతూ రికార్డు కలెక్షన్లు రాబట్టేట్టు చేశారు. అయితే మహేష్ బాబు బురదలో రాళ్లు వేయడం ఎందుకులే అని ఊరుకున్నా వాళ్ల ఫ్యాన్స్ మాత్ర ఊరుకోలేదు. ఏ ఛానల్ అయితే తప్పుడు ప్రచారం చేసిందో ఆ ఛానల్‌కి చుక్కలు చూపించారు. చివరికి ఏ నోటితో అయితే ఫ్లాప్ అని ప్రచారం చేశారో అదే నోటితో హిట్ అనేట్టు చేశారు. ఇక మహేష్ బాబు సైలెంట్‌గా ఉన్నా.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఊరుకోలేదు. ‘సర్కారు వారి పాట’ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేసిన ఆ ఛానల్‌కి చురకలేశారు. పోకిరి, దూకుడు సినిమాలకంటే ఈ సినిమా పెద్ద హిట్ అని.. ప్రేక్షకులకు మంచి సినిమాని దూరం చేయడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు కృష్ణ. ఆయన మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ సినిమా చూడగానే మహేష్ బాబుకి ఫోన్ చేశా.. పోకిరి, దూకుడు కంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. అదే జరగడంతో చాలా హ్యాపీగా ఉంది. సర్కారు వారి పాట ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్ టైన్మెంట్‌గా ఉంది.. సెకండాఫ్‌లో మహేష్ పెర్ఫామెన్స్ ఎక్సార్డినరీగా ఉంది. ఈ పిక్చర్స్ అన్ని సెంటర్లలోనూ హౌస్ ఫుల్ అవుతుంది. మంచి కలెక్షన్లు రాబడుతుంది. కానీ కొన్ని ఛానల్స్ వాళ్లు.. సినిమా బాగోలేదని ప్రచారం చేశారు. డివైడ్ టాక్ వచ్చేట్టు చేశారు. నిజానికి సినిమా చూసిన ప్రేక్షకుల్లో డివైడ్ టాకే లేదు.

సూపర్ హిట్ ఫిల్మ్.. పోకిరి, దూకుడు కంటే కూడా చాలాబాగుంది. ఇన్నేళ్లు వచ్చినా కూడా మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడు (నవ్వుతూ). పోకిరిలోకంటే కూడా వయసు తక్కువగా కనిపిస్తున్నాడు. షూటింగ్ లేని టైంలో కూడా మెయిన్‌టైన్ బాగా చేస్తాడు. జిమ్‌లోనే ఉంటాడు. సోషల్ ఇష్యూస్‌ని టచ్ చేసే సినిమాలు చేస్తున్నాడు.. హీరో కెరియర్స్‌లో అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి కానీ.. మహేష్‌కి వరుసగా ఇలాంటి సినిమాలు పడుతున్నాయి. సోషల్ ఇష్యూస్‌ని ప్రజెంట్ చేసే విధానం కూడా చాలాబాగుంది. సర్కారు వారి పాట గురించి సుప్రీం కోర్టులో మాట్లాడారు. అంత బాగా తీశారు. తీసుకున్న పాయింట్ అంత బలమైనది. మే 31 నా బర్త్ డే.. గత కొన్నేళ్లుగా పబ్లిక్ ఈవెంట్‌లకు వెళ్లడం లేదు.. ఎక్కువ శ్రమ అనిపిస్తుందని వెళ్లలేకపోతున్నా.. అందుకే నాకు ఇష్టమైన వంటకాలను ఆరోజు మా అమ్మాయి ఇంట్లోనే చేసిపెడుతుంది.. అదే నా బర్త్ డే ట్రీట్’  మహానుభావుడు  ఎన్టీర్ శత జయంతి ఉత్సవాలు చేయడం సినిమా పరిశ్రమ ఆనందించతగ్గ విషయం.  అయన కుమారుడు బాలకృష్ణ ని  ఈ విషయం లో ముందుండి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.

 

 

Tags :