అఫ్గాన్ కోసం.. ప్రపంచ దేశాలను కోరిన ఐరాస

అఫ్గాన్ కోసం.. ప్రపంచ దేశాలను కోరిన ఐరాస

తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించాల్సిందిగా ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి (ఐరాస) కోరింది. జెనీవాలో జరిగిన విరాళాల సేకరణ సదస్సులో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ మాట్లాడారు.  ఈ ఏడాది డిసెంబర్‌ వరకు అఫ్గాన్‌ ప్రజలు కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ  దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలన్నారు. అఫ్గాన్‌ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యారాజ్య సమితి అత్యవసర విభాగం తరపున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

 

Tags :