పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇండియా

పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇండియా

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది ఇండియా. భద్రతా మండలి సమావేశాల్లో కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ ప్రస్తావించడాన్ని ఇండియా తప్పుపట్టింది. యూఎన్‌లోని భారత కౌన్సలర్‌ డాక్టర్‌ కాజల్‌ భట్‌ దీనిపై మాట్లాడుతూ పాకిస్థాన్‌ నుంచి చొరబడే ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉగ్రవాదం, హింస లేని అనుకూల వాతావరణంలో మాత్రమే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందన్నారు. పాకిస్థాన్‌తో సహా అన్ని దేశాలతో ఇండియా సోదర సంబంధాలను ఆశిస్తోందని, ఏవైనా సమస్యలు ఉంటే, అవి ద్వైపాక్షికమైనా, సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్‌ డిక్లరేషన్‌ లాంటి వాటిపైన కూడా శాంతియుతంగా చర్చించనున్నట్లు తెలిపారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉంటుందని అన్నారు. అప్పటి వరకు సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్‌ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

భారత్‌పై యూఎన్‌ వేదికగా పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారాలు చేయడం ఇది మొదటిసారి కాదు అని అన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు పాక్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. ఆ దేశంలో మాత్రం ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరురుగుతున్నారు. సాధారణ ప్రజలకు, మైనార్టీలకు అక్కడ ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు.

 

Tags :