ఉద్దవ్ ఠాక్రే కు సుప్రీంకోర్టు షాక్... షిండేకు

ఉద్దవ్ ఠాక్రే కు సుప్రీంకోర్టు షాక్... షిండేకు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని సుప్రీం కోర్టును ఆశ్రయించింది షిండే వర్గం. అయితే గుర్తింపు అధికారం ఇవ్వకుండా ఈసీని అడ్డుకోవాలంటూ మరో పిటిషన్‌ వేసింది ఠాక్రే వర్గం. ఈ పిటిషన్ల విచారణకై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్‌ ఠాక్రే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.