ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎస్ఎం సుభాని

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎస్ఎం సుభాని

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది ఎస్‌ఎం సుభాని ని సుప్రీంకోర్టు కొలిజియం ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పాట్నా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు చెరో ఏడుగురు న్యాయమూర్తులకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలిజియం ప్రతిపాదించింది. ఏడాదిలో  దేశంలోని వివిధ హైకోర్టులకు 195 మంది న్యాయమూర్తులకు కొలిజియం ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 26 మంది ఉన్నారు. 11 న్యాయమూర్తి పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

 

Tags :