రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు.. సంచలన ఆదేశాలు

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు.. సంచలన ఆదేశాలు

వలస పాలకుల నాటి రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ చట్టాన్ని పున పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన నేపథ్యంలో అప్పటిదాకా ఈ చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్ర పున పరిశీలన పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించింది. రాజద్రోహ చట్టాన్ని సమీక్షించనున్న నేపథ్యంలో ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సమీక్ష పూర్తయ్యే వరకు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయవచ్చు కదా అని సూచించింది. ఈ క్రమంలోనే రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకోవచ్చని తెలిపింది.

 

 

Tags :