MKOne TeluguTimes-Youtube-Channel

మహిళ హక్కులపై అమెరికాలో.. కొత్త రగడ

మహిళ హక్కులపై అమెరికాలో.. కొత్త రగడ

ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులపై ప్రభావం చూపగల నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు త్వరలోనే తీసుకోనుంది. స్త్రీలకు గర్బస్రావం చేయించుకోవడానికి రాజ్యాంగబద్దమైన హక్కు ఉందని 1973లో రో వెర్సస్‌ వేడ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును తల్లకిందులు చేసే ప్రయత్నం మొదలైంది. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల్లో అత్యధికులు గర్భస్రావ హక్కును కొట్టివేయాలని యోచిస్తున్నట్లు సూచించే ముసాయిదాను పొలిటికో సంస్థ బయటపెట్టింది. అదే నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా గర్భస్తావ వ్యతిరేకులకు కొండంత బలం వస్తుంది. మహిళ హక్కుల ఉద్యమకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకానుంది. గర్భస్త్రావ హక్కును పరిరక్షించే రో వెర్సస్‌ వేడ్‌ తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చితే అది విశాల ప్రజానీకం అభిమాతాన్ని తృణీకరించనట్లు అవుతుంది. అయినా కూడా రో తీర్పును రద్దు చేయడానికే ప్రస్తుత సుప్రీంకోర్టు కట్టుబడి ఉన్నట్లు బలమైన సూచనలు కనిపిస్తున్నాయి.

 

Tags :