బైడెన్ హామీకి.. సుప్రీంకోర్టు కోత!

బైడెన్ హామీకి.. సుప్రీంకోర్టు కోత!

వాతావరణ మార్పులపై పోరులో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన హామీ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాలుష్య ఉద్గారాలను మరింత పెంచేందిగా ఉంది. భూ తాపాన్ని మరింత పెంచే థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల కాలుష్య కారక వాయులను నియంత్రించే అధ్యక్షుని అధికారాలకు సుప్రీం కోత పెట్టింది. క్లీన్‌ ఎయిర్‌ చట్టం అటువంటి అధికారాలేవీ ప్రభుత్వానికి ఇవ్వలేదని చెప్పింది. 6`3 కోట్ల తేడాతో కోర్టు ఇచ్చిన ఈ రూలింగ్‌తో వాతావరణ మార్పులకు సంబంధించిన బైడెన్‌ ప్రణాళికలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ దశాబ్దం చివరి నాటికి దేశ కాలుష్య వాయువులను సగానికి తగ్గించాల్సి ఉంది. మొత్తం కర్బన ఉద్గారాల్లో 30 శాతం దాకా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుండే వస్తుంది.

 

Tags :