సుప్రీం కోర్టు విచారణలు సెప్టెంబరు 27 నుంచి ప్రత్యక్ష ప్రసారం

సుప్రీం కోర్టు విచారణలు సెప్టెంబరు 27 నుంచి ప్రత్యక్ష ప్రసారం

ఈ నెల 27 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగే విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ మేరకు చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్ నేతృత్వంలో జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పౌర సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక చట్టాలకు సంబంధించిన విచారణలను దేశప్రజలు అందరూ ప్రత్యక్షంగా వీక్షించే వీలుంటుంది. సీజేఐ లలిత్ ఆధ్వర్యంలో మంళవారం ఫుల్ కోర్టు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే సుప్రీంకోర్టు విచరణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ముందుగా రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రసారం చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మిగతా ధర్మాసనాల విచారణలు కూడా కవర్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ ప్రసారాలు యూట్యూబ్ లో ఉంటాయని, త్వరలోనే సుప్రీంకోర్టు ఈ ప్రసారాల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేసుకుంటుందని సమచారం.

 

 

Tags :