సుప్రీంకోర్టు కీలక తీర్పు .. ఎస్సీ వర్గీకరణపై

సుప్రీంకోర్టు కీలక తీర్పు .. ఎస్సీ వర్గీకరణపై

షెడ్యూల్‌ కులాల (ఎస్సీ) వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌ మాత్రమే సమస్య పరిష్కరించాలని పేర్కొంటూ ఎస్సీ వర్గీకరణపై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతివ్వాలని ఎమ్మార్పీఎస్‌ పిటిషన్‌ వేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ ఉప కులాలు నష్టపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఏడుగురు లేదా ఎనిమిది మంది జడ్జీల లార్జర్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మంద కృష్ణ మాదిగ అన్నారు.

 

Tags :